మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి పరువునష్టం కేసు ఎదుర్కుంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఝార్కండ్ కోర్టులో చుక్కెదురైంది. వ్యక్తిగత మినహాయింపు కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కాగా ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ తన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. ఇప్పుడు ఝార్ఖండ్ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కుదరదని రాహుల్‌కు తేల్చి చెప్పేసింది.









