స్మార్ట్‌ఫోన్ ప్రియులకు రియల్‌మీ గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ కొత్తగా తీసుకురానున్న Realme 16x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆగస్టు 12న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. గతేడాది విడుదలైన Realme 15x 5Gకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ “Stay Smooth. Stay Unstoppable” అనే ట్యాగ్‌లైన్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది.
Realme 16x 5Gలో 7,000mAh భారీ బ్యాటరీని అందించనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. దీంతో సాధారణ వినియోగంతో పాటు ఎక్కువ సమయం ఫోన్ ఉపయోగించే వారికి కూడా బ్యాటరీ బ్యాకప్ మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
దీర్ఘకాలిక పనితీరును దృష్టిలో ఉంచుకుని Realme 16x 5G కోసం 6 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ ప్రామిస్, 60 నెలల ఫ్లూయెన్సీ గ్యారంటీని కంపెనీ ప్రకటించింది. దీని ద్వారా ఎక్కువ కాలం పాటు బ్యాటరీ సామర్థ్యం, ఫోన్ పనితీరు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు రియల్‌మీ పేర్కొంది. లాంచ్ రోజున ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.








