AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవినాష్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉంది:సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సీబీఐ తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.ఈ కౌంటర్ కాపీలో పలు కీలక విషయాలను ప్రస్తావించింది సీబీఐ.అవినాష్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉందని, దురుద్దేశంతోనే అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సీబీఐ పేర్కొంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటేసి వాస్తవాలు చెప్పడం లేదన్నారు.దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా అవినాష్ సమాధానాలిచ్చారని,దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ముందస్తు బెయిల్ కోరుతున్నారని తెలిపారు.వివేకా కేసును రెండు నేరాలుగా పరిగణించిన సీబీఐ.. వివేకాను హత్య చేయడం ఒక నేరమయితే.. ఆధారాలు చెరిపేయడం మరో నేరమని చెప్పింది. గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్, దస్తగిరిని నిందితులుగా పేర్కొంది.ఆధారాలు చెరిపేసిన నేరంలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్, శివ శంకర్, అవినాశ్ రెడ్డిని నిందితులుగా చేర్చింది.

ANN TOP 10