AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పరిహారం ఇస్తారా..? లేదా?.. ప్రభుత్వంపై పొంగులేటి ఫైర్

ఖమ్మం జిల్లా వైరా మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించారు.అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న,వరి పంటలను పరిశీలించి.. రైతులకు ధైర్యం చెప్పారు.నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పొంగులేటి విమర్శించారు. పంటలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పంట నష్టపరిహారం ఇస్తానని హామీ ఇచ్చి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రైతుల అకౌంట్లలో నేటికీ డబ్బులు జమ కాలేదన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలకే పరిమితమయ్యారని విమర్శించారు.రెండు రోజుల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని .. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని.. లేదంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

ANN TOP 10