AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బూటకమని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి: కేజ్రీవాల్

దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కుంభకోణం ఒక బూటకమని అన్నారు. తమ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పేరును పొరపాటున ఛార్జ్ షీటులో చేర్చినట్టు ఈడీ చెప్పడమే దీనికి నిదర్శనమన్నారు. ఒక వ్యక్తి పేరును పొరపాటున కూడా ఛార్జ్ షీట్ లో రాస్తారా? అని ఎద్దేవా చేశారు. ఈ స్కామ్ బూటకమని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నించారు. మన దేశంలో అత్యంత నిజాయతీ గల పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకే ప్రధాని మోదీ ఇదంతా చేయిస్తున్నారని మండిపడ్డారు. కాగా ఛార్జ్ షీట్ లో ఎంపీ సంజయ్ సింగ్ పేరు చేర్చడంపై ఈడీ అధికారులు ఆయనకు క్షమాపణ చెప్పారు. లీగల్ నోటీసుతో సంజయ్ సింగ్ కు వివరణ ఇచ్చింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన పేరును ఛార్జ్‎షీట్‎లో పేర్కొనడంపై ఈడీకి లీగల్ నోటీసులు పంపించారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.దీంతో.. పొరపాటు జరిగినట్లు సంజయ్ సింగ్‎కు ఈడీ వివరించింది. రాహుల్ సింగ్‎కి బదులుగా సంజయ్ సింగ్ అని అనుకోకుండా ప్రస్తావించినట్లు ఒప్పుకుంది.

ANN TOP 10