సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు.కొంత మంది మాట్లాడతారే గానీ..పని చేయరు అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి తనకు పిలుపు రాలేదని గవర్నర్ తెలిపారు.దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ ఈ స్టేట్ ఛీఫ్ ను కలవలేమని తమిళిసై వ్యాఖ్యానించారు.ప్రగతి భవన్,రాజ్ భవన్ దూరదూరంగా ఉంటున్నాయన్నారు.డెవలప్మెంట్ అంటే ఒక్క ఫ్యామిలీ డెవలప్ కావడం కాదని.. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని తమిళిసై కేసీఆర్ కు కౌంటరిచ్చారు.









