AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల

ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా.. చిత్ర యూనిట్ అంచనాలను తలక్రిందులు చేస్తూ.. అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. లైగర్ డిజాస్టర్ తో పరాభవం ఎదుర్కున్న ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ.. మళ్లీ ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే సమంతతో కలిసి చేస్తున్న ‘ఖుషీ’పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఆ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ‘జెర్సీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. హీరో, హీరోయిన్లపై ముహూర్తపు షాట్‌కి ప్రగతి ప్రింటర్స్ ఎండీ పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేయగా, ఆనరరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ సౌత్ కొరియా చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి జరుగనుంది.

ANN TOP 10