ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాఫన్ ప్రియులను అలరించే గొప్ప వేడుకల్లో ‘మెట్ గలా’ ఉత్సవం అంగరంగ వైభవంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. ఈ ప్రోగ్రామ్‌లో వరల్డ్ వైడ్‌గా ఎంతో మంది హీరోయిన్స్ రకరకాల ఫ్యాషన్ వేర్‌లో కనిపించి కనువిందు చేశారు. పొడువాటి గౌన్లతో కొందరు అలరిస్తే.. మరికొన్ని చిత్ర విచిత్రమైన డ్రెస్సింగ్‌తో చూసే వీక్షకుల మనసు దోచేసారు.
ఈ వేడుకలో ప్రముఖ హీరోయిన్ ఆలియా భట్.. వైట్ అండ్ వైట్ గౌనులో క్యాట్ వాక్ చేసింది. దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆలియా భట్.. ఆ తర్వాత తన ప్రేమికుడు రణ్‌బీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.









