AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చూపులా.. చుర కత్తులా..


నభా నటేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్‌ మరియు యాక్టింగ్‌తో యూత్‌కు ఆరాధ్య హీరోయిన్ అయింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క సినిమా లేకుండా పోయింది. ఎందుకు నభా నటేష్ రేసులో వెనకబడింది. ఆ మధ్య జరిగిన సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నభా నటేష్ విషయానికొస్తే.. స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్ ముందుగా శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘వజ్రకాయ’ సినిమాతో హీరోయిన్‌‌గా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా ఒక్కసారిగా టాలీవుడ్ హాట్ టాపిక్ అయిపోయింది. దానికి తోడు అమ్మడి అందాల ఆరబోత కూడా సెగలు పుట్టించింది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్‌ వేర్‌ లో ఉన్న కొన్ని పిక్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ANN TOP 10