AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నోరూరించే నీరా.. నగరవాసుల కోసం రెడీ..

హైదరాబాద్ సాగర తీరం మరో ఆతిథ్యానికి సిద్ధమైంది. ఇప్పటికే అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం, నూతన సచివాలయం ఏర్పాటు కాగా.. సహజమైన నీరాతో పాటు తెలంగాణ రుచులను అందజేసే ‘నీరా కేఫ్‌’ ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్డులో హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున ఏర్పాటు చేసిన నీరాకేఫ్‌, ఫుడ్‌ కోర్టును ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు ఇద్దరూ ఇతర నేతలతో కలిసి నీరా సేవించారు.

కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. నీరా అంటే ఆల్కహాల్ అనే దుష్ప్రచారం ఉందని అన్నారు. కానీ నిజానికి ఇది స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న అమృతమని చెప్పారు. గౌడన్నల ఆత్మగౌరవానికి‌ నీరా కేఫ్ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. గీత వృత్తి తరరతాల నుంచి వస్తుందని.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా నీరా కేఫ్ లేదని అన్నారు. నీరా బహుళ పోషకాల గని అని వ్యాఖ్యనించారు. స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న అమృతమని అన్నారు. ఇందులో క్యాల్షియం, ఐరన్, పాస్పరస్, పోటాషియం, ప్రొటీన్, షుగర్, విటమిన్ సి లాంటి ఎన్నో పోషక విలువలు ఉంటాయన్నారు.

నీరా కేఫ్ ప్రత్యేకతలు..
ఈ నీరా కేఫ్ నగరవాసులకు సరికొత్త అనుభూతినివ్వనుంది. పల్లెను తలపించే పచ్చని వాతావరణంలో నీరాకేఫ్‌ను ఏర్పాటు చేశారు. రూ.20 కోట్ల వ్యయంతో సాగర తీరాన దీన్ని నిర్మించారు. గీత కార్మికుల అస్తిత్వానికి ప్రతీకగా… కల్లుకు బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చి దీన్ని పరిశ్రమ స్థాయికి తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం నీరా కేఫ్‌కు ఏర్పాటు చేసింది. రెస్టారెంట్ తరహాలో తీర్చిదిద్దిన ఈ నీరా కేఫ్ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఇక్కడ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేయగా.. మొదటి అంతస్తులో నీరాను విక్రయించనున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరాను ప్రాసెస్ చేసి ఇక్కడి కేఫ్‌లో విక్రయిస్తారు.

ANN TOP 10