AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొండగట్టులో సస్పెన్స్ థ్రిల్లర్

జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో ఓ క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. జమ్మికుంటకు చెందిన దర్శకుడు గౌతమ్ కృష్ణ, నిర్మాత సతీష్ లు అమ్మ బ్యానర్ లో నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ముహూర్తం కొండగట్టులో చేపట్టగా, ఎమ్మెల్యే క్లాప్ కొట్టి ప్రారంభించారు.ఈ సినిమాలో ఎమ్మెల్యే తనయుడు సుంకె దీక్షిత్ ఏసీపీ క్యారెక్టర్ లో హీరో, హైదరాబాద్ కి చెందిన నవ్యశ్రీనివాస్ హీరోయిన్ గా చేస్తున్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే రవిశంకర్ కుటుంబ సభ్యులతో పాటు, సినిమా యూనిట్ సభ్యులoదరూ.. అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థప్రసాదం అందజేశారు.

ANN TOP 10