AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓఆర్ఆర్ టెండర్ వివాదంపై ఆర్ఎస్పీ ఏమన్నారంటే…

తెలంగాణ రాజకీయాల్లో ఔటర్ రింగ్ రోడ్డు వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఓఆర్ఆర్ టెండర్ ను తక్కువకే కట్టబెట్టడంపై ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పై మండిపడుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంపై తన ట్విట్టర్ లో విమర్శలు కురిపించారు. తెలంగాణ అంటే ఒకటి కాదని, రెండు అని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఒకటి బయటికి కనిపించే సచివాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు అయితే.. రెండోది కనిపించని రహస్య జీవోలు, అగ్రిమెంట్లు, లీజులు, అసైన్డ్ భూముల అమ్మకం, బినామీలు, కమీషన్లు, లిక్కర్-ఇసుక మాఫియా, సొంత టీవీ ఛానళ్లు, బతుకమ్మ చీరలు, వాటి కింద చితికిపోయిన జీవితాలని బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు.

ANN TOP 10