AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పారిశుద్ధ్య కార్మికులకు కేసీఆర్ గుడ్ న్యూస్

మే డే పురస్కరించుకుని సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులు శుభవార్త చెప్పారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.నెలనెలా అందుతున్న జీతానికి అదనంగా మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో నెంబర్ 39, 40 లను విడుదల చేసింది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో పని చేస్తున్న మొత్తం 1,06,474 మందికి లబ్ధి చేకూరనుంది. ఇక దీనిపై మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని కొనియాడారు.

ANN TOP 10