AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదాద్రిలో నేటి నుంచి నృసింహుడి జయంత్యుత్సవాలు


స్వయంభు పాంచనారసింహుడు కొలువుదీరిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నృసింహుడి జయంత్యుత్సవాలు కొనసాగనున్నాయి. యాదగిరిక్షేత్రంతో పాటు అనుబంధ ఆలయాలైన పాతగుట్ట, దబ్బగుంటపల్లి యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయాల్లో జయంతి మహోత్సవాలు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

ఉదయం 9.30 గంటలకు ప్ర ధానాలయ ముఖమండపంలో విశ్వక్సేనారాధన, స్వస్తివాచనంతో నృసిం హ జయంతి ఆధ్యాత్మిక పర్వాలకు సంప్రదాయరీతిలో శ్రీకారం చుట్టారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో ఈ నెల 4వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం, దబ్బగుంటపల్లి గ్రామంలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉదయం9గంటలకు విశ్వక్సేనారాధనలతో జయంతి వేడుకలు ఆరంభించి ఉదయం 11.30గంటలకు లక్ష్మీనృసింహుల తిరుకల్యాణోత్సవం నిర్వహిస్తారు. జయంతి మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీవరకు భక్తులు జరిపించుకునే ఆర్జిత సేవలు మొక్కు, శాశ్వత కల్యాణ్యాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమ పూజలను రద్దు చేసినట్టు దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు.

ANN TOP 10