AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేపర్ లీకేజీ ఓ పద్ధతి ప్రకారం జరిగిన కుట్ర: మర్రి శశిధర్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని ఆ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మర్రి శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ లో నిర్వహించిన పార్టీ జిల్లా పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు.తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం ఒక్క బీజేపీకే సాధ్యమవుతుందన్నారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఓ పద్ధతి ప్రకారం జరిగిన కుట్ర అని ఆరోపించారు. పేపర్ లీకేజీతో దాదాపు 30 వేల మంది నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని.. ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతి నిరుద్యోగ యువత తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కేవలం గెలవడమే కాకుండా.. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుందని తెలిపారు.

ANN TOP 10