జగిత్యాల జిల్లా పోలీసు విభాగంలో విషాదం చోటుచేసుకుంది.విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన ఓ మహిళా కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. మల్యాల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వేదశ్రీ.. డ్యూటీలో భాగంగా బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి కొందపడిపోయింది.వేదశ్రీకి తీవ్రగాయాలు కావడంతో.. స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందారు.వేద శ్రీ మరణంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.జిల్లా ఎస్పీ భాస్కర్ జగిత్యాల ఏరియా ఆసుపత్రికి చేరుకుని కానిస్టేబుల్ వేదశ్రీ మృతదేహానికి నివాళులు అర్పించారు.









