AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లిక్కర్ స్కాంలో మూడో ఛార్జ్ షీట్.. కవిత, కవిత భర్తపై అభియోగాలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు తాజాగా మూడో ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్ పేర్లను చేర్చారు. ఈ మేరకు కవితపై కీలక అభియోగాలు మోపారు. ప్రముఖంగా సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక విషయాలను ఈడీ ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్తతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది.

ANN TOP 10