ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు.కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారు ఆరోపణలు చేసినంత మాత్రానా మోదీకి జరిగే నష్టమేమి లేదని తెలిపారు.కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డీకే అరుణ,కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మెప్పించలేక,ఒప్పించలేక..మోడీపై అక్కసు వెల్లగక్కుతున్నారని,ఇది దేశ ప్రజలంత గమనిస్తున్నారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలుసుకుని.. ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు ఎంత నోరు పారేసుకున్నా.. వాటిని తాను ఆశీర్వాదంలా స్వీకరిస్తానని అని మోడీ అనడం, ఆయన పెద్ద మనసుకు నిదర్శనమని డీకే అరుణ కొనియాడారు.









