ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఆర్ అండ్ బీ రోడ్లు అద్దంలా తయారు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో ఆయన ఉన్నతాధికారులతో మొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల వల్ల డ్యామేజ్ అయిన 1172 పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతుల కోసం సీఎం కేసీఆర్ రూ.2858 కోట్లు మంజూరు చేశారని వేముల వెల్లడించారు.నిర్ణీత గడువులోగా ప్రణాళిక ప్రకారం పనులు శరవేగంగా పూర్తి కావాలని ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాస రాజు,ఈఎన్సీ రవీందర్ రావు,ఇతర అధికారులను ఆదేశించారు.ఇప్పటికే రూ. 518 కోట్లతో 1393 కి.మీ.మేర రోడ్ల మరమ్మతులు పూర్తి చేశామని.. వచ్చే 45 రోజుల్లో మిగతా 2,700 కి.మీ మేర మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.ప్రతీ వారం తానే స్వయంగా పనుల పురోగతిని పరిశీలిస్తానని తెలిపారు.









