AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏం జరిగినా.. కిషన్ రెడ్డినే బాధ్యున్ని చేస్తున్నారు: బీజేపీ

మ్యాన్ హోల్ లో పడి చిన్నారి మృతిచెందిన ఘటనపై బీజేపీ కార్పోరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మౌనిక మృతికి బాధ్యత వహిస్తూ.. మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలో కార్పోరేటర్లు శంకర్ యాదవ్, రవి చారి, ఆకుల శ్రీవాణి మీడియాతో మాట్లాడారు.

జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ప్రాణాలకు ఖరీదు కడుతున్నారని ఫైర్ అయ్యారు. మౌనిక మృతిపై జీహెచ్ఎంసీ సిబ్బందిని కాకుండా బాధ్యులైన ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో కోట్ల నిధుల వసూళ్లు చేస్తుందని.. కానీ మౌలిక సదుపాయాల కోసం మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని మండిపడ్డారు.మరోవైపు టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదాల్లో 10మంది వరకు చనిపోయారని తెలిపారు. నగరంలో ఏ సంఘటన జరిగినా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని బాధ్యులను చేయడం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మానుకోవాలని హెచ్చరించారు.

ANN TOP 10