AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సెక్రటేరియెట్ కు వెళ్తుండగా రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

నూతన సచివాలయానికి వెళ్లేందుకు యత్నించిన టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.మార్గంమధ్యలో టెలిఫోన్ భవన్ దగ్గర రేవంత్ ను ఆపేశారు.దీంతో రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.ఔటర్ రింగ్ కాంట్రాక్టు అంశంలో భారీ అక్రమాలు జరిగాయని.. దీనిపై మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేసేందుకు సెక్రటేరియెట్ కు వెళ్తున్నానని,తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్ ప్రశ్నించారు.అక్కడే రేవంత్ రెడ్డి సెంట్రల్ జోన్ డీసీపీతో ఫోన్ లో మాట్లాడారు.తనను వెళ్లనివ్వకపోతే.. రోడ్డుపైనే కూర్చుంటానన్నారు.తాను ఒక ఎంపీగా సెక్రటేరియట్ కు వెళితే పోలీసులకు అభ్యంతరమేంటని రేవంత్ నిలదీశారు.తానేం ధర్నా చేయడానికి,నిరసన తెలపడానికి వెళ్లడం లేదని,సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెలుసుకోవడానికి వెళ్తుంటే అడ్డుకొని దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు.పోలీసులు తనను ఆపడం అప్రజాస్వామికమన్నారు. తానొక్కడినే వెళ్లి అధికారులను కలుస్తానని చెప్పానని, పోలీస్ వాహనంలోనే తీసుకెళ్లమన్నానని..అయినప్పటికీ పోలీసులు ఒప్పుకోలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఔటర్ రింగురోడ్డులో జరిగిన అవినీతి బయటపడుతుందనే భయంతోనే..ప్రభుత్వం తనను పోలీసుల ద్వారా అడ్డుకుంటుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ANN TOP 10