యాదాద్రి: భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. బీబీనగర్ మండలం రుద్రవెళ్లి వద్ద లెవల్ బ్రడ్జి మీది నుంచి మూసి నది ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో బీబీనగర్-పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బోలేపల్లి-చౌటుప్పల్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో భారీ వర్షం కురవడంతో మూసి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.









