తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి గత రాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి 10:50 గంటల సమయంలో తరలించారు. అయితే కేంద్రమంత్రికి ఛాతిలో నొప్పి రావడానికి కారణం గ్యాస్ సమస్య అని వైద్యులు తేల్చారు. కార్డియో న్యూరో సెంటర్‌లోని కార్డియాక్ కేర్ యూనిట్‌లో వైద్యులు కిషన్‌రెడ్డికి చికిత్సను అందిస్నతున్నారు. నేడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.









