హైదరాబాద్: టీడీపీలో (TDP) చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో తాను చేరటం లేదని… బీజేపీలో (BJP) కొనసాగాలనేది తన అభిమతమన్నారు. బీజేపీ విధించిన స్పెన్షన్ ఎత్తివేతపై ఆఖరి క్షణం వరకు ఎదురుచుస్తానని చెప్పారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రాజకీయాలకు దూరంగా జరిగి.. హిందూ ధర్మం కోసం పనిచేస్తానన్నారు.
అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజాసింగ్ ప్రసంశల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ధికి కారణం చంద్రబాబు అని.. కేసీఆర్‌తో ఏమీ కాలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మళ్ళీ గెలిచే అవకాశాలున్నాయని తెలిపారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని… రాజకీయంగా తనకు చంద్రబాబే లైఫ్ ఇచ్చారన్నారు.









