AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్నూలు పారిశుద్ధ్యంపై కమిషనర్ ప్రత్యేక దృష్టి.. క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షణ

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్నూలు నగరపాలక సంస్థకు పలువురు కమిషనర్లు మారినా, పారిశుద్ధ్య వ్యవస్థలో ఆశించిన స్థాయిలో మార్పులు కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుత కమిషనర్ చల్లా ఓబులేసు పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు.

ప్రతి రోజు ఉదయం 3 నుంచి 4 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. చెత్త సేకరణ, శుభ్రత పనుల అమలుపై అధికారులను అప్రమత్తం చేస్తూ, సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తున్నారు.

నగర పరిశుభ్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కమిషనర్ ముందుండి పనిచేస్తుండటంతో పారిశుద్ధ్య వ్యవస్థలో మార్పులు తీసుకురావడంపై దృష్టి సారించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు.

ANN TOP 10