ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దివంగత గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబన్ అహ్మద్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జైలులో ఉన్న తన సోదరుడు అలీ అహ్మద్‌ను కలిసేందుకు వెళ్తుండగా ఝాన్సీ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. అబన్ అహ్మద్ తన సహచరులతో కలిసి ప్రయాణిస్తున్న కారు అతివేగం కారణంగా అదుపుతప్పి హైవేపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ఘటనలో అబన్ అహ్మద్‌తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న ఇతర ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.








