AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చిన్నారి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

సికింద్రాబాద్‌లోని కలాసిగూడలో మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. చిన్నారి మౌనిక మృతి పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని గద్వాల విజయలక్ష్మి తెలిపారు. మ్యాన్‌హోల్స్ మూసేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలిక కుటుంబాన్ని గద్వాల్ విజయలక్ష్మి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

నగరంలో ఉదయం కుండపోత వర్షం పడటంతో రోడ్లపై నిలిచిన వర్షం నీరు వెళ్ళడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్ తెరిచారు. పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన చిన్నారి ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది. వెంటనే రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ సిబ్బంది చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పార్క్ లైన్ మ్యాన్‌హోల్ వద్ద చిన్నారి మృతదేహాం లభ్యమైంది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మౌనిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

ANN TOP 10