AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీమిండియాలోకి రీఎంట్రీ కోసం షమీ కసరత్తు.. ఐదు కిలోల బరువు తగ్గాడు

భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత జాతీయ జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, మళ్లీ టీమిండియాలోకి రావాలనే లక్ష్యంతో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన షమీ, ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

గత రంజీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు, విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి తన ఫామ్‌ను నిరూపించుకున్నప్పటికీ, బీసీసీఐ ఎంపికదారులు అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదు. అయినా నిరాశ చెందకుండా పునరాగమనం కోసం షమీ కఠినంగా శ్రమిస్తున్నాడని అతని బాల్య శిక్షకుడు మహమ్మద్ బద్రుద్దీన్ తెలిపారు.

గత సీజన్ నుంచి ఇప్పటివరకు షమీ ఐదు కిలోల బరువు తగ్గాడని, మానసికంగా ఎంతో బలంగా ఉన్నాడని బద్రుద్దీన్ వెల్లడించారు. దేశానికి అవసరమైనప్పుడు సేవలు అందించేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత పేస్ బౌలింగ్ విభాగం ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తూ, పేస్‌కు అనుకూల పరిస్థితుల్లో షమీ అనుభవం ఎంతో ఉపయోగపడేదని అభిప్రాయపడ్డారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో కూడా షమీ అనుభవం భారత్‌కు కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.

ANN TOP 10