AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

హైదరాబాద్‌లో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా నేరస్థుల ముఠాను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులతో పాటు చోరీ సొత్తు కొనుగోలు చేసిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలు, చోరీలకు ఉపయోగించిన పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు దేరంగుల హరిబాబు అలియాస్ నాని జూన్ 2026లో జైలు నుంచి విడుదలైన అనంతరం తన్నీరు సూర్య, నరాల రాహుల్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. అనంతరం వివిధ కమిషనరేట్ల పరిధిలో ఇళ్ల తాళాలు పగులగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులపై గతంలోనే పలు కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. హరిబాబుపై 27 కేసులు, సూర్యపై 13 కేసులు, రాహుల్‌పై 3 కేసులు ఉన్నట్లు తెలిపారు. పాత నేర చరిత్ర కలిగిన ఈ ముఠాను పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు.

ANN TOP 10