AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పార్టీ నేతలపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీలో (Congress) ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని మాజీ పీసీసీ చీప్ వి.హనుమంతరావు (V hanumanth rao) వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీభవన్‌లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్షలో వీహెచ్‌ పాల్గొని ప్రసంగించారు. పార్టీలో అందరూ బలగం సినిమా తరహాలో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నరేంద్ర మోదీ (Narendra modi) వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఉందా.. లేదా అనిపిస్తుందన్నారు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామన్నారని.. ఎన్నో చెప్పారు కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ ఇవ్వలేదన్నారు. రైతులను కూడా మోదీ మోసం చేశారని విమర్శించారు. మోదీ వచ్చాక పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్‌పరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రాహుల్ గాంధీని (Rahul Gandhi) పార్లమెంట్ నుంచి అనర్హత వేటు వేసి, ఇల్లు ఖాళీ చేయించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదన్నారు. బండి సంజయ్ నిరుద్యోగ యువత కోసం పోరాటం అంటున్నారని.. తమరు ఇస్తామన్నా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ అన్నారని.. ఉద్యోగాలు ఏమయ్యాయి కేసీఆర్ అని నిలదీశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. బీసీలకు సమయం ఆసన్నమైందని తెలిపారు. రాహుల్ గాంధీకి అండగా అంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి గ్రామంలో చెప్పాలన్నారు.

ANN TOP 10