బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా.. ఎమ్మెల్యేలంతా హైదరాబాదులోనే ఉండడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే ప్రజాప్రతినిధులంతా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాబోయే రోజుల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని.. పనితీరు మెరుగుపరచుకోవాలని.. తీరు మార్చుకోకపోతే తోకలు కత్తిరిస్తానని హెచ్చరించారు.ప్రజల్లో ఆదరణ ఉన్న వారికే రాబోయే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఎలా ఆదరణ ఉందని వివరాలు సైతం తెలుసుకుంటున్నట్లు సమాచారం. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నా.. విమర్శలను తిప్పి కొట్టడంలో అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.









