AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత్‌లో కొత్తగా 9000 కొవిడ్ కేసులు

ఒక్క రోజులో 26 మంది మృతి
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో భారత్‌లో 9355 కొత్త కొవిడ్ కేసులు చోటుచేసుకున్నాయని, 26 మంది మృతి చెందారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం విడుదలచేసిన డేటా తెలిపింది. కాగా రోజువారీ పాజిటివ్ డేటా 4.08 శాతంగా, వారాంతపు పాజిటివిటీ రేటు 5.36 శాతంగా ఉందని పేర్కొంది. మూడేళ్ల కొవిడ్ మహమ్మారి కాలంలో క్రియాశీలక కేసుల సంఖ్య 57410. ఇప్పటి వరకు ఇండియాలో 44.9 మిలియన్ కేసులు రిపోర్టు కాగా, 531424 మరణాలు సంభవించాయని డేటా పేర్కొంది.

కొవిడ్ క్రియాశీలక కేసులు నేడు కర్నాటకలో 1734, కేరళలో 13773, మహారాష్ట్రలో 5233, గుజరాత్‌లో 1632, ఢిల్లీలో 4708, తమిళనాడులో 3463, హిమాచల్‌ప్రదేశ్‌లో 1172, హర్యానాలో 4394, ఛత్తీస్‌గఢ్‌లో 2857, రాజస్థాన్‌లో 3440, ఉత్తర్‌ప్రదేశ్‌లో 3874 కేసులు రిపోర్టయ్యాయి.

ANN TOP 10