ప్రస్తుతం క్రికెట్‌లో ప్రతిభతో పాటు ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్లకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రొఫెషనల్ క్రికెటర్లు ప్రత్యేక డైట్ ప్లాన్‌లు, కఠినమైన వర్కౌట్‌లను పాటిస్తూ తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నారు. అయితే 15 ఏళ్ల వయసులోనే పెద్ద వేదికపై సత్తా చాటుతున్న వైభవ్ సూర్యవంశీ మాత్రం తన ఆహారపు అలవాట్ల విషయంలో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. అతడి సహజమైన జీవనశైలి, సింపుల్ డైట్ ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
సమస్తిపూర్‌కు చెందిన వైభవ్ చిన్న వయసులోనే క్రికెట్‌లో అద్భుత ప్రతిభను కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇతర యువ అథ్లెట్లు ఫిట్‌నెస్ కోసం కఠినమైన డైట్ చార్ట్‌లను అనుసరిస్తుంటే.. వైభవ్ మాత్రం తనకు అలవాటైన సంప్రదాయ ఆహారానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండే అతడు.. తన శరీరానికి అవసరమైన పోషకాలను సాధారణ ఆహారం ద్వారానే పొందుతున్నట్లు చెబుతున్నాడు.
ముఖ్యంగా తన తల్లి చేతి వంట అంటే తనకు ఎంతో ఇష్టమని వైభవ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఎక్కడికి వెళ్లినా, ఎంత దూరం ప్రయాణించినా ఇంటి భోజనాన్నే తినేందుకు ఇష్టపడతానని చెప్పాడు. సాదాసీదాగా కనిపించే ఈ ఆహారపు అలవాట్లే తనకు శారీరకంగా, మానసికంగా బలాన్ని ఇస్తున్నాయని వైభవ్ భావిస్తున్నాడు. ఆధునిక ఫిట్‌నెస్ ట్రెండ్స్ మధ్య కూడా సంప్రదాయ ఆహారంతోనే తన ఆటతీరును కొనసాగిస్తున్న వైభవ్ విధానం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.








