మదనపల్లె మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులు తండ్రి తట్టి ఉత్తమ రెడ్డి మృతి చెందారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన నాయకులు రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు తట్టి శ్రీనివాసులు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉత్తమ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని నాయకులు సూచించారు. ఉత్తమ రెడ్డి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు తమ పూర్తి సానుభూతి ఉంటుందని తెలిపారు.
అనంతరం యాలగిరి దొరస్వామి నాయుడు, మెహబూబ్ ఖాన్, జాఫర్, జేసీ రెడ్డప్ప తదితరులు తట్టి శ్రీనివాసులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు ఉత్తమ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసి.. కుటుంబానికి ధైర్యం చెప్పారు.








