రూ.8లక్షల పరిహారం చెల్లించాలని ఏపీ హైకోర్టు ఆదేశం
చిత్తూరు: గుడ్డు తిని చిన్నారి మృతి చెందిన కేసులో బాధిత కుటుంబానికి రూ .8 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.. వివరాలలోకి వెళితే గత ఏడాది కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్డు తిని చిన్నారి మృతి చెందింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన మానవ హక్కుల సంఘం బాధిత కుటుంబానికి రూ.8లక్షల పరిహారం ఇవ్వాలని అంగన్‌వాడీ టీచర్, అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలపై అధికారులు హైకోర్టుకు వెళ్లడంతో మానవహక్కుల సంఘం నిర్ణయం సరైనదేనని సమర్థించింది. చిన్నారి మరణం మానవ తప్పిదంగానే ధర్మాసనం పేర్కొంది.









