బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం..
తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు (BRS Inauguration Celebrations) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే పార్టీ జెండా ఆవిష్కరించి.. అమరులకు నివాళులర్పించారు. అనంతరం జనరల్ బాడీ సమావేశం (General Body Meeting) ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
పార్టీ ప్రతినిధుల సమావేశానికి ఆహ్వానం ఉన్న నేతలను మాత్రమే సిబ్బంది లోపలకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనరల్ బాడీ సమావేశంలో పలు కీలక తీర్మానాలపై చర్చలు జరిపి.. నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్ అనుమతితో నేతలు పలు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. కాగా తెలంగాణ భవన్‌లోకి మీడియాకు ప్రవేశంలేదు.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి జనరల్ బాడీ మీటింగ్ ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశానికి 279 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది. సాయంత్రం 4 గంటల వరకు సమావేశం జరగనుంది. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు.









