కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష గురువారం ప్రారంభమైంది. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ మీనాక్షి నటరాజన్ (MP Meenakshi Natarajan), పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షులు వీహెచ్ , మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి (former MLA Kodanda Reddy), పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ.. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్న దళిత, గిరిజన వర్గాలను కాపాడుకుంటూనే.. జనాభాలో సగ భాగం బడుగు, బలహీన వర్గాలకు ‘ చెయ్యి ‘ అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జన గణనలో కుల గణన, బీసీ జనాభా మేరకు రిజర్వేషన్ల పెంపు, క్రిమిలేయర్ ఎత్తివేత అంశాలు.. బీసీ వర్గాల నుంచి మొదటి నుంచి వినిపిస్తోంది.









