AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు హైదరాబాదీ విద్యార్థుల మృతి

అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు మరణించారు. కెంటుక్కీలోని జాన్స్‌బర్గ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు గాయపడగా ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మూడో విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరంతా ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. మరణించిన విద్యార్థులను మొహమ్మద్ పైజల్, ఇషర్‌ముద్దీన్‌గా గుర్తించారు. సెయింట్ లూయీలోని దార్ ఇస్లాం మసీదులో మృతుల కోసం ప్రార్థనలు(నమాజ్ ఇ జనజా) జరిగాయి. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు జరిగాయి.

ANN TOP 10