AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక అప్‌డేట్

అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్ దాల్‌లు నిందితులుగా ఉన్నారు. గతంలో సిసోడియా పేరు ఏ చార్జిషీట్‌ లోనూ లేదు. చార్జిషీట్‌లోని అంశాలపై వాదనలకు మే 12వ తేదీని కోర్టు ఖరారు చేసింది.

ఢిల్లీ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 26న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా (Manish Sisodia) ను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కూడా సిసోడియాను ఈడీ విచారిస్తోంది. ఎక్సైజ్ పాలసీలో అవినీతికి సిసోడియా ప్రధాన కుట్రదారు అని ఆరోపించింది.

ANN TOP 10