తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ పార్టీ ప్రజలకు నమ్మకాన్ని కలిగించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అన్ని పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. గోషామహల్ లో బీఆర్ఎస్ నేత నందకిషోర్ వ్యాస్ బిలాల్ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.గోషామహల్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిందని.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇక్కడి ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు.గోషామహల్ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ పటిష్ఠంగా మారిందని.. ప్రస్తుతం ఎలాంటి అల్లర్లు లేకుండా బేగంబజార్ లో ఎంతోమంది సంతోషంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు. కుల,మతాల రెచ్చగొట్టి.. ప్రజలను విడగొట్టడమే అమిత్ షా టార్గెట్ అని మండిపడ్డారు.మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్న వారికి.. ప్రజల అవసరాలు, సమస్యలు పట్టవని విమర్శించారు.









