AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొత్త సచివాలయ భవనంలోకి శాఖల తరలింపు

రాష్ట్ర నూతన సచివాలయ భవనాన్ని ఈనెల 30వ తేదీన సీఎం కేసీఆర్‌ప్రారంభించనుండగా అందులోకి నేటి నుంచి ఫైళ్ల తరలింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశా లు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సచివాలయంలోని మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. వారికి అనుబంధంగా ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, విభాగాలకు ఛాంబర్లు, గదులు, వర్క్ స్టేషన్లు ఉంటా యి. శాఖలవారీగా కొత్త సచివాలయ భవనంలోకి నేటి నుంచి తరలింపు ప్రక్రియ చేపట్టాలన్న ప్రభుత్వ సీఎస్ ఒక్కో శాఖకు ఒక్కో సమయాన్ని కేటాయించారు. ఈనెల 28వ తేదీ నాటికి తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని సీఎస్ శాంతకుమారి అన్ని శాఖల కార్యదర్శలను ఆదేశించారు. ఈనెల 30వ తేదీన సచివాలయం ప్రారంభించే నాటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించే విధంగా సిద్ధం కావాలని సీఎస్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖల కేటాయింపు
ఈనెల 26వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వరకు షిఫ్టింగ్ కొనసాగనుంది. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖల కేటాయింపు జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్‌లో హోం శాఖ, పంచాయతీరాజ్, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ, మూడో ఫ్లోర్‌లో వ్యవసాయ శాఖ, ఎస్సీ డెవలప్‌మెంట్‌కు కేటాయించారు. ఇక నాలుగో అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా డిపార్ట్‌మెంట్, ఐదో అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ (జిఏడి), ఆర్ అండ్ బి, ఆరో ఫ్లోర్‌లో సిఎం, సిఎస్‌లకు కేటాయించారు. లోవర్ గ్రౌండ్ ప్లోర్‌లో స్టోర్స్, రికార్డు రూమ్‌లతో పాటు వివిధ సేవలకు సంబంధించిన ఆఫీసులను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శాఖల వారీగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ANN TOP 10