ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.మనీష్ సిసోడియా, అరుణ్ రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు, అమన్దీప్ దల్, అర్జున్ పాండేలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మనీష్ సిసోడియా, బుచ్చిబాబుపై కీలక అభియోగాలు మోపింది. లిక్కర్ కేసుకు సంబంధించి దర్యాప్తులోని కీలక అంశాలను సీబీఐ రెండో ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. గత నవంబర్ లో సీబీఐ మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొదటి ఛార్జ్ షీట్ దాఖలు తరువాతే మనీష్ సిసోడియాను అరెస్టు చేయడంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురిని ప్రశ్నించింది సీబీఐ.మనీష్ సిసోడియాను ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.









