పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్ధిపేటలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ కేసులు పెడుతున్నారని.. మోదీకి తెలంగాణ మీద ప్రేమ లేదని అన్నారు.
కేసీఆర్‌ను తిట్టడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని, కేసీఆర్‌ను తిట్టినంత మాత్రాన వాళ్లు పెద్దోళ్లు అయిపోరని తెలిపారు. కేసీఆర్ భయపడే నాయకుడు కాదని.. ఒక ఉద్యమ జ్వాల, అభివృద్ధి జ్వాల అని కొనియాడారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఎవరైనా నిర్మించారా?.. 24 గంటల కరెంట్ ఎవరైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. ఈ సారి కూడా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.









