వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యారు. పోలీసులపై దాడి కేసులో షర్మిల సోమవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. షర్మిలను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో షర్మిల న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. జైలు విడుదలైన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు.
మహిళా అని చూడకుండా తన మీద పడి దాడి చేశారని షర్మిల తెలిపారు. తనపై కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వెనక్కి తగ్గేది కాదన్నారు. తెలంగాణ పోలీసులు సీఎం కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. తన శరీరాన్ని తాకే వీడియోలు, పోలీసులు తనపై కన్నెర్ర చేసే వీడియోలు ఎక్కడ బయటపెట్టలేదని.. కొన్ని సెలెక్టడ్ వీడియోలు మాత్రం రిలీజ్ చేశారని తెలిపారు. ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయని కేసీఆర్.. ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నారని ఈ సందర్భంగా షర్మిల ఫైర్ అయ్యారు.తొమ్మిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.సెక్రటేరియట్‌కు కేసీఆర్ ఎప్పుడైన వెళ్లారా అని నిలదీశారు.ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారని విమర్శించారు.కమీషన్లతో వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు.ప్రశ్నించిన ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారని మండిపడ్డారు.









