వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. కాసేపటి క్రితమే ఆమె జైలు నుండి బయటకు వచ్చారు.పోలీసులపై దాడి కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.30వేలు, ఇద్దరు పూచికత్తుతో షరుతులతో కూడా బెయిల్ ఇచ్చింది. బెయిల్ దొరకడంతో షర్మిల జైలు నుంచి బయటకు వచ్చారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, వారిని కొట్టిన కేసులో పలు సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్ననే షర్మిల కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. ధర్మాసనం ఆమెకు ఊరటనిస్తూ కండిషన్లతో బెయిల్ మంజూరు చేసింది.









