AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నకిలీ నగదు కలకలం

నగరంలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షల్లో నకిలీ నగదు పట్టుబడింది. నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నఅంతరాష్ట్ర ముఠా ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు.

సీపీ తెలిపిన వివరాల ప్రకారం..రెండున్నర నెలల క్రితం ఫేక్ కరెన్సీ వచ్చిందని సైబారాబాద్ లోని ఐడీబీఐ మరియు ఆదర్శ బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నకిలీ రాయుళ్ల ఆట కట్టించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపాయి. అప్పటినుంచి లోతుగా విచారణ చేపట్టిన అధికారులు.. అంతరాష్ట్ర ఫేక్ కరెన్సీ గ్యాంగ్ ను పట్టుకున్నారు. 13 మందిని అరెస్ట్ చేసి.. వారి దగ్గరి నుండి రూ. 30 లక్షల 68 వేల నకిలీ కరెన్సీ, రూ. 60వేల నగదు స్వాధీనం చేసుకుని.. వారి ఫోన్ లను సీజ్ చేశారు. ఈ ముఠా నాలుగు రాష్ట్రాలలో ఈ నకిలీ కరెన్సీనీ చెలామణి చేస్తున్నట్టు గుర్తించారు.

ANN TOP 10