ఆస్తమా రోగులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన చేప మందు (Fish Medicine)ను బత్తిని సోదరులు (Battini Brothers) త్వరలో పంపిణీ చేయనున్నారు. జూన్ 10వ తేదీ ఉదయం 8 గంటలకు (మృగశిర కార్తె ప్రవేశించగానే) చేపమందు పంపిణీ ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రోజు 24 గంటల పాటు చేపమందు పంపిణీ చేయనున్నారు. కొవిడ్ కారణంగా గత మూడేళ్లు (2020, 2021, 2022)గా చేపమందు పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా చేప మందు కోసం దేశ నలుమూలల నుంచి ఆస్తమా రోగులు హైదరాబాద్‌కు వస్తారు.
చేప మందు పంపిణికి హైదరాబాద్ వాసులు బత్తిన సోదరులు ప్రసిద్ధి చెందారు. ప్రతి సారి ఎన్ని వివాదాలొచ్చినా, చేప మందులో శాస్త్రీయత లేదని కోర్టులకు వెళ్ళినా సరే చేప మందు ప్రతి ఏటా పంపిణీ చేస్తూనే వచ్చారు. అయితే కరోనా కారణంగా 2020 నుంచి చేప మందు పంపిణీ నిలిపివేశారు. బత్తిన సోదరులు అందించే చేప మందు కోసం జనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు. వివిధ రాష్ట్రాల నుండి హైదరాబాద్‌కు వచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బస చేసి.. చేప మందు కోసం ఎదురు చూస్తారు.









