AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మల్లన్నా.. మజాకా..

మంత్రి మల్లారెడ్డి నయా జోష్

మంత్రి మల్లారెడ్డి.. తన డైలాగులతో, డాన్సులతో ఎంతో పాపులర్ అయ్యారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ.. ట్రెండ్ సెట్టర్ గా మారారు మల్లారెడ్డి.సందర్భం దొరికినప్పుడల్లా ఆడుతూ పాడుతూ తన చుట్టూ ఉండేవారిలో జోష్ నింపుతారు. తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సభలు, ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపుకుంటున్న సంగతి తెలిసిందే.మంత్రి మల్లారెడ్డి కూడా మేడ్చల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన అనుచరులతో కలిసి బైక్ ర్యాలీ చేస్తూ.. తూముకుంటలో జరిగే సభకు బయలుదేరారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఒక మంత్రిలా కాకుండా సాధారణమైన కార్యకర్తలా అందరితో కాసేపు నడిచుకుంటూ ర్యాలీని ముందుకు తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత తన అనుచరుడి బైక్ ఎక్కిన మల్లారెడ్డి.. హుషారుగా డాన్స్ చేస్తూ కార్యకర్తల్లో ఉత్సహాన్ని నింపారు. అది చూసిన కార్యకర్తల ముఖాల్లో నవ్వుల పూలు పూశాయి. ఆ సంతోషంలో.. మల్లారెడ్డితో పాటు కార్యకర్తలు సైతం అంతే ఉత్సాహంగా ముందుకు కదిలారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాతో వైరల్ గా మారింది.ఏది ఏమైనా మంత్రి మల్లారెడ్డి స్టైలే వేరు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణమంతా జోష్ ఫుల్ గా ఉంటుంది.

ANN TOP 10