తెలంగాణలో భయానక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తున్న యవకుడిని బండరాయితో కొట్టి చంపారు యువతి, ఆమె కుటుంబసభ్యులు. యువకుడి తలను రాయితో ఛిద్రం చేసి అత్యంత దారుణంగా కడతేర్చారు. యువతి.. తండ్రి, తల్లి, తమ్ముడు కలిసి యువకుడిని కొట్టి చంపారు. ఈ భయానక ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో జరిగింది. నడిరోడ్డుపైనే జరిగిన ఈ దారుణ ఘటన తెలంగాణలో కలకలం రేపింది. మహేష్ అనే 25 ఏళ్ల యువకుడు కూతురిని వేధిస్తుండటంతో యువతి కుటుంబసభ్యులు చంపినట్లు పేర్కొంటున్నారు. గతంలోనే మహేష్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగకపోవడంతో ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ మర్డర్ జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్లు వీడియో తీయడంతో ఇది వెలుగు చూసింది.. యువతి కుటుంబం మహేష్‌ను కొట్టి చంపుతుంటే చుట్టుపక్కల వాళ్లు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. మహేష్ స్థానికులకు తెలిసినవాడే అయినా ఎవరూ ఈ దారుణాన్ని ఆపేందుకు ముందుకు రాలేదు. నడిరోడ్డుపై యువతి, ఆమె తల్లితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు మహేష్ ను చంపుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. బండరాయితో మోది చంపే ముందు మహేష్‌పై కత్తితో దాడి చేశారు. ఈ విషయం బయటకు రావడంతో వెంటనే పోలీసులు స్పాట్‌కి చేరుకుని.. పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి, మహేష్ ఇద్దరు గత నాలుగేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. విషయం తెలియడంతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు యువతి తండ్రి. దీంతో ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. తర్వాత యువతికి వేరే వ్యక్తితో ఏడాదిన్నర క్రితం పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇదే క్రమంలో ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, అసభ్యకర ఫోటోలు, మెసేజ్ లను యువతి భర్తకు ఫార్వాడ్ చేశాడు మహేష్.. దీంతో మనస్తాపానికి గురైన వివాహిత భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇదే విషయం తెలుసుకున్న ఆమె బంధువులు మహేష్ పై కోపం పెంచుకున్నారు. పలుసార్లు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. సింగరేణిలో పనిచేస్తున్న మహేష్.. ఇవాళ ఉదయం పాలు పోసి వస్తుండగా వివాహిత ఇంటి దగ్గరకు రాగానే పథకం ప్రకారం.. యువకుడిని చంపారు. బండరాయితో మోది చంపే ముందు కత్తితో మహేష్‌పై దాడి చేశారు.. మహేష్ పెళ్లైన ఆమెకు అసభ్య మెసేజ్‌లు పంపి వేధిస్తుండటంతో ఈ దరుణానికి పాల్పడినట్లు పేర్కొంటున్నారు.
తమ వాడి తప్పే లేదని.. యువతే ఫోన్ చేస్తుందని చెప్పున్నారు మహేష్ మేనత్త, పిన్నిలు. జైపూర్ ఎస్ఐతో కలిసి దాడికి ప్లాన్ చేశారని ఆరోపిస్తున్నారు మృతుడి బంధువులు. పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. కాగా.. తన కొడుకును చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని మహేష్ తల్లి పోలీసులను వేడుకుంటోంది.









