అమ్మన్యూస్ అంటే రాజకీయ పార్టీలకు వత్తాసు పలికే ఛానల్ కాదని.. నిజాలను నిర్భయంగా చూపించే ఛానల్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.ప్రజల కష్టాలను ప్రభుత్వానికి చూపించి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తుందని కొనియాడారు.అమ్మన్యూస్ అందరి ఛానల్ గా గుర్తింపు పొందిందని ప్రశంసించారు. ఆదిలాబాద్ సమస్యలను అమ్మ న్యూస్ కళ్లకు కట్టినట్టు చూపిస్తుందని తెలిపారు.ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు అమ్మన్యూస్ అంటేనే భయపడుతున్నారని చెప్పారు. కరీంనగర్ లో ఆయన అమ్మన్యూస్ తో మాట్లాడారు.
అమ్మ న్యూస్ పై అక్రమ కేసులను బండి సంజయ్ ఖండించారు.ఆదిలాబాద్ లో జరుగుతున్న వాస్తవాలను, సమస్యలను అమ్మన్యూస్ చూపిస్తుందని.. వాటిని అర్థం చేసుకుని పరిష్కరించకుండా.. కేసులు పెట్టి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అమ్మ న్యూస్ ఛానల్ పై కేసు పెట్టి.. డైరెక్టర్లకు నోటీసులివ్వడం కంటే దుర్మార్గం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. అమ్మన్యూస్ యాజమాన్యాన్ని విచారణ పేరుతో స్టేషన్ కు పిలవడం దారుణమన్నారు. నిజాలు జీర్ణించుకోలేకే ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని.. అధికార బలంతో పోలీసుల ద్వారా అమ్మ న్యూస్ యాజమాన్యాన్ని వేధించడం కరెక్ట్ కాదని చెప్పారు. మీడియా హక్కులను కాలారాసే ప్రయత్నం చేస్తున్నారని, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ జర్నలిస్టులను ఎగతాళి చేశారని.. కేసీఆర్ మాదిరిగానే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీడియాను, జర్నలిస్టులను బెదిరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని.. వెంటనే అమ్మ న్యూస్ పై కేసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.









